Theft | మద్దూరు (ధూళిమిట్ట), జూలై 01: ధూళిమిట్ట మండలంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మండల పరిధిలోని బెక్కల్, బైరాన్‌పల్లి గ్రామాలలోని దుర్గమ్మ దేవాలయాలలో సోమవారం రాత్రి దొంగలు చోరీలకు పాల్పడ్డారు.
గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుర్గమ్మ ఆలయాలలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆలయంలోని హుండీలను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. దొంగలు చోరికి పాల్పతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాలను సందర్శించి, క్లూస్ టీం సభ్యుల సహకారంతో ఆధారాలు సేకరించారు. బైరాన్‌పల్లి దుర్గమ్మ ఆలయంలో చోరీ జరుగడం ఇది రెండోసారి. కాగా ఆలయాలతోపాటు మద్దూరు, మర్మాముల, సలాఖపూర్, లద్నూర్ గ్రామాలలోని ఇండ్లలల్లో దొంగలు చోరీలకు పాల్పడుతుండడం పట్ల ఉమ్మడి మద్దూరు మండల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!