Urea | రాయపోల్, జులై 15 : పంటలకు యూరియాను అధికంగా వాడవద్దని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ రైతులకు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. యూరియా అధికంగా వాడితే జరిగే అనర్థాలను వివరించారు.
అధికంగా యూరియా అతి వాడకం వల్ల కలిగే నష్టాలు :
*యూరియా ను అవసరానికి మించి వాడితే భూమి నిస్సారం అవుతుంది.
*యూరియా అతిగా వాడితే మొక్కలు పేలుసు బారి చీడ పీడల పెరుగుతుంది.
*యూరియా అధికంగా వాడటం వలన నెలలో ఉండి పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులు తగ్గిపోతావి.
*యూరియా ఆమ్లా స్వభావం కలిగి ఉంటుంది దీని వలన యూరియా అధికంగా వాడటం వలన భూములు ఆమ్ల నెలలుగా మారుతవి. అదే విధంగా నానో యూరియా వాడకం గురించి రైతులకు వివరించటం జరిగింది.
* యూరియా వేసిన తరువాత పంటలకు 30 నుండి 35% వరకే మొక్కలకు అందుతుంది మిగతాది గాలిలోకి ఆవిరి రూపంలో భూ పొరలలోకి , భూగర్బ జలాల్లో కలిసిపోతుంది. కానీ నానో యూరియా అనేది పంట ఆనుకులమైన పైన స్ప్రే చేయడం ద్వారా 80 నుండి 90% పంట పొలానికి ఉపయోగపడుతుంది.
* ఒక హాఫ్ లీటర్ నానో యూరియా ఒక 45కేజీల బ్యాగ్ తో సమానం.
* ఒక హాఫ్ లీటర్ నానో యూరియా ధర రూ. 205.00 మాత్రమే.
* ఒక హాఫ్ లీటర్ నానో యూరియా ఒక ఎకరాకు సరిపోతుంది.
* 25 రోజుల లోపు పంట పొలానికి 2మీ లీ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి, 25 రోజుల దాటిన పంట పొలానికి 4 నుండి 5 మీ లీ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి