Retirement | రాయపోల్, జనవరి 07 : ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంసాగర్లో ప్రధానోపాధ్యాయుడిగా ఉండి పదవి విరమణ పొందిన మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహించి విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించిన సత్యనారాయణ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. ఉపాధ్యాయునిగా ప్రస్థానం కొనసాగిస్తూ.. మండల విద్యాధికారిగా ఎదిగి పాఠశాలల బలోపేతానికి ఆయన చేసిన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.
రాయపోల్ మండలవ్యాప్తంగా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సత్యనారాయణ రెడ్డి నిరంతరం శ్రమించారని తెలిపారు. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన అనుభవాలను విద్యాశాఖకు అందించాలని అన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న సత్యనారాయణరెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ అధ్యక్షతన వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, యాదయ్య, మహేష్, శ్యామ్ సుందర్ శర్మ, నవీన్ కుమార్, సుజాత, మంజుల, ఉమారాణీ, అనీఫ్, విజయ, నాగరాజు, అలాగే సిఆర్పిలు స్వామి గౌడ్, ఎల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?