TGSRTC | రాయపోల్, ఆగస్టు 10 : సాధారణంగా పండుగల సమయంలో తాత్కాలికంగా టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడం చూస్తుంటాం. అయితే పండుగల పేరుతో ఆర్టీసీ ప్రయాణికుల వద్ద భారీగా అదనపు చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తే పండుగ స్పెషల్ అంటూ టిక్కెట్లు ఇస్తున్నారని ప్రయాణికులు వాపోయారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన సాగర్ సోమవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు టికెట్ తీసుకోగా రూ.140 రూపాయలు తీసుకుని కండక్టర్ టికెట్ ఇచ్చాడు. అయితే అంతకుముందు టికెట్ ధర రూ. 90 రూపాయలు ఉండగా.. పండుగ పేరుతో రూ.140 రూపాయలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని సాగర్ కండక్టర్‌ను ప్రశ్నించారు. పండుగ స్పెషల్ బస్సులు నడుపుతున్నా.. టికెట్ ధర అంతే ఉంటుందని కండక్టర్‌తో కొద్దిసేపు వాదించాడు. శనివారం పండుగ జరగగా సోమవారం కూడా ఆర్టీసీ బస్సులు అదనపు చార్జీలు వసూలు చేసి ప్రయాణికులను మరింత అసౌకర్యానికి గురి చేస్తున్నట్లు సాగర్ పేర్కొంటున్నాడు.
ఇప్పటికే ఆర్టీసీ మహిళలకు ఉచితంగా సౌకర్యం ఏర్పాటు చేయగా.. తమకు ఉన్న టికెట్ ధర కంటే అదనంగా స్పెషల్ బస్ పేరిట వసూలు చేయడం పట్ల సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు అంటే ఇదేనా..? ప్రయాణికుల వద్ద అందిన కాడికి అదనపు బస్సుల పేరుతో వసూలు చేయడం దారుణమని. ఈ విషయంలో ఆర్టీసీ ఉన్నత అధికారులు చొరవ చూపి స్పెషల్ బస్సుల పేరిట అదనంగా టికెట్ ధర వసూలు చేయడాన్ని అదుపు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇక సామాన్యులు ఆర్టీసీ ప్రయాణం చేయడానికి జంకుతున్నారు.
urea | గన్నేరువరంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు
Farmers concern | యూరియా కొరతపై రైతుల ఆందోళన.. పోలీసుల పహారాలో పంపిణీ
Karepalli | కారేపల్లి మండలంలో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ