KCR | చేర్యాల, ఏప్రిల్ 17 : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రానుండడంతో కాంగ్రెస్ సర్కారులో వణుకు మొదలైందని ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయా గ్రామాల ఇన్చార్జీలు ఇవాళ పర్యటించారు. ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించి వాల్పోస్టర్లు ఆవిష్కరించడంతోపాటు గ్రామాల వారిగా బహిరంగ సభకు తరలివచ్చే వారి సంఖ్య, వారికి కావాల్సిన వసతి తదితర వాటిని నమోదు చేసుకున్నారు.
అనంతరం ఆయా గ్రామాల్లో నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోపాటు కాంగ్రెస్ వ్యతిరేకులు సైతం సభకు తరలివచ్చేందుకు సిద్దమవుతున్నారని, రైతులు, పార్టీ అభిమానులు విరాళాలు సైతం అందజేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం గ్రామాల్లో తమ పర్యటనల సందర్భంగా వెల్లడవుతుందని.. రానున్న రోజుల్లో ఎలాంటి ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ప్రభంజనం మొదలవుతుందన్నారు. పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అక్రమంగా పెడుతున్న కేసులను ఎదుర్కొనేందుకు అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
రోజురోజుకూ కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని.. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అన్ని వర్గాల ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ కమిటీల అధ్యక్షులు, అనుబంద సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత