KCR | తొగుట : తెలంగాణలోని సబ్బండ వర్గాలను తనతో కలుపుకొని.. దశాబ్ధాల కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మండలంలోని వెంకట్రావుపేటలో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పులిగారి శివయ్యతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ సకల జనుల ప్రగతి వేదికగా మార్చి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ రాక ముందు గుక్కెడు తాగు, సాగునీటి కోసం, కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డామని గుర్తు చేశారు. నాడు తెలంగాణ అంటేనే వెక్కిరించిన గొంతులు, నేడు మన వెన్నంటి వొచ్చేలా చేసిన ఘనత కేసీఆర్ కార్యదీక్షా దక్షతకే దక్కుతుందన్నారు. నాడు తెలంగాణ వొస్తే ఏమొస్తాయో అని చెప్పిన కేసీఆర్.. నిధులు, నీళ్లు, నియామకాలు అందించి తెలంగాణ సాధనను ఫలప్రదం చేయడం జరిగిందన్నారు.
రైతు బిడ్డగా రూ.65 వేల కోట్లు రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని.. ఇది దేశ చరిత్రలో ఒక రికార్డు అన్నారు. తెలంగాణతోపాటు దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి వెన్నంటి నిలిచిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతతోపాటు శుభాకాంక్షలు తెలియజేశారు.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి