National lok adalat | సిద్దిపేట టౌన్, మే 20 : జాతీయ లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు పరిష్కారం అయేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జున్ 9 నుండి 14వరకు జరిగే జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశం ఇవాళ కోర్టు ప్రాంగణంలో జరిగింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. జిల్లాలో సివిల్, క్రిమినల్, ఎక్సైజ్,మోటార్ వాహనాల కేసులు అధిక సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్‌లో అన్ని రకాల రాజీమార్గం ద్వారా రాజీకుదుర్చుకొని ఉపశమనం పొందాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి పెద్ద ఎత్తున కేసులను పరిష్కరించాలన్నారు.
కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు మిలింద్‌కాంబ్లే, సంతోష్‌కుమార్, తరణి,పీపీ జీవన్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ