Agriculture Material | చేగుంట, మార్చి26 : సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేయడం జరుగుతుందని నార్సింగి మండల వ్యవసాయశాఖ అధికారి ఎం యాదగిరి తెలిపారు. మండల కేంద్రమైన నార్సింగిలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా 2024-25కు సంవత్సరానికిగాను జనరల్, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం, ఇతర రైతులకు 40 శాతం రాయితీపై వ్యవసాయ, ట్రాక్టర్ పనిముట్లను అందజేయడం జరుగుతుందన్నారు.
నార్సింగి మండలానికి 3 హ్యాండ్ ఆపరేటర్ స్ప్రేయర్స్, ఒక పవర్ స్ప్రేయర్, ఒక రోటవేటర్, 2 కల్టివేటర్స్, ఒక బ్రష్ కట్టర్ కేటాయించడం జరిగిందని, ఆసక్తి ఉన్న మహిళ రైతులు వారి పేరుమీద ఉన్నటువంటి ట్రాక్టర్ రిజిస్టేషన్ పేపర్లు, ఆధార్‌కార్డు జిరాక్స్, భూమికి సంబంధించిన పాస్బుక్కు వివరాలు, ఒరిజనల్ డీడీతోపాటు దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసుకొని ఈ నెల 30తేది వరకు నార్సింగి మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి