Students | రాయపోల్, అక్టోబర్ 21 : చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వడ్డేపల్లి మండల ప్రజా పరిషత్ పరిషత్ పాఠశాలకు 112 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ టై, బెల్ట్, ఐడి కార్డ్స్, నోట్ పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. విద్యార్థినీ విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని ముందుకు కొనసాగిస్తూ తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రీడలు, చదువు ఎంతో ముఖ్యమని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు నేడు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు రాణిస్తున్నారని గుర్తు చేశారు.
క్రీడలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం కల్పిస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నారు. అలాగే చదువులో మండలంలో జిల్లాలో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, సీఆర్పీ యాదగిరి, ఉపాధ్యాయలు నరేష్, జీనథ్, మాధురి, సాజిద్ పాల్గొన్నారు.
Narnoor | నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో వెదజల్లుతున్న దుర్వాసన
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!