Rayapole MPDO | రాయపోల్, డిసెంబర్ 01 : రాయపోల్ మండల ఎంపీడీవోగా డాక్టర్ చిలుముల శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటానని, ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో శ్రీనివాస్‌ను ఇటీవల రిటైర్ అయిన ఎంపీడీవో జెమ్లా నాయక్, సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ముతాలీబ్, జూనియర్ అసిస్టెంట్ బాలయ్య, ఫయాజొద్దీన్, ఏపీవో రాములు, ఈసీ జనార్ధన్, అనిల్ కుమార్ పంచాయతీ కార్యదర్శులు శివకుమార్, పరమేశ్వర్, సతీష్, కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీనివాస్, స్వామి, ప్రభావతి, నరహరి, కార్యాలయ సిబ్బంది పాల్గొని అభినందించారు.

Padipuja | అయ్యప్ప స్వామి పడిపూజలో మాజీ ఎమ్మెల్యే
Local Election | విద్యుత్ నో డ్యూ సర్టిఫికెట్ కోసం ఎన్నికల అభ్యర్థుల తిప్పలు
Bomb Threat | కేరళ సీఎంకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు