Farooq Hussain | రాయపోల్, జులై 24 : పేదలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. గురువారం రాయపోల్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గల్వ జీవన్ రెడ్డి సోదరుడు సత్తిరెడ్డి బుధవారం చేగుంట సమీపంలో లారీ ఢీకొని మృతి చెందిన విషయం తెలుసుకొని గురువారం రాయపోల్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. చిన్న వయసులో సత్తిరెడ్డి మృతి చెందడం ఎంతో బాధాకరమని షారుఖ్ హుస్సేన్ తన ప్రగాడ సంతాపం తెలియజేశారు.
బాధిత కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని.. కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. ఫారుక్ హుస్సేన్ వెంట ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకుడు మంజుర్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, జెడ్పీటీసీ యాదగిరి. అంకిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ రాజిరెడ్డి. తాజా మాజీ సర్పంచ్ వెంకట నరసింహారెడ్డి. రాయపోల్ మాజీ సర్పంచ్ కమ్మరి శ్రీనివాస్ చారి. వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సత్తిరెడ్డి మృతి ఎంతో బాధాకరం : బీఆర్ఎస్ సమన్వయకర్త రణం శీను
రాయపోల్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గల్వ జీవన్ రెడ్డి సోదరుడైన సత్తిరెడ్డి లారీ ఢీకొని మృతిచెందగా.. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, ఉమ్మడి మండల మాజీ ఏఎంసీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు రేకుల నరసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హనుమండ్ల రాజిరెడ్డి, ఇప్ప దయాకర్, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా రణం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబంలో జన్మించి వికలాంగుడైన సత్తిరెడ్డి మృతి బాధాకరమని.. ఆయన మృతి పట్ల విచార వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని వారు పేర్కొన్నారు.
Srisailam Temple | శ్రీశైలం మల్లన్న ఆలయానికి 27రోజుల్లో రూ.4.17కోట్ల ఆదాయం..!
Ramavaram : జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చు : జీఎం షాలెం రాజు
KTR | తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కేటీఆర్ : ఎమ్మెల్యే కొనింటి మానిక్ రావు