రామవరం, జూలై 24 : జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌సీఓఏ క్లబ్ నందు బుధవారం రాత్రి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (WPS & GA) వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షాలెం రాజు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కార్మికుల్లో టీమ్ స్పిరిట్ పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహద పడుతాయన్నారు. ఈ టీమ్ స్పిరిట్‌తో బొగ్గు ఉత్పత్తి, రక్షణలో కూడా మెరుగుదల ఉందన్నారు. డెపార్ట్మెంటల్ క్రీడలను పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించినందుకు సంబంధిత అధికారులను అలాగే WPS & GA సభ్యులను జీఎం అభినందించారు.
అనంతరం కోల్ ఇండియాలో బాడీ బిల్డింగ్ విబాగంలో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించి మిస్టర్ కోల్ ఇండియాగా ఎంపికైన ఎం.రామకృష్ణ, అసిస్టెంట్ చైర్మన్, జేవిఆర్ ఓసి.II, అలాగే ఈ.సుష్మా రాణి, జూనియర్ అసిస్టెంట్, ఎస్టేట్ డిపార్ట్మెంట్ 100 మీటర్స్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ పోటీల్లో సిల్వర్ మెడల్స్ అలాగే 4×100 రిలే పోటీల్లో కాంస్య మెడల్ కలిపి మొత్తం 4 మెడల్స్ సాధించినందుకు, అలాగే పబ్లిక్ సెక్టార్ నందు అథ్లెటిక్ విబాగంలో పాల్గొనందుకు పి.పవన్ కుమార్ ను శాలువాతో సత్కరించి చెక్కులను అంధించారు.
Ramavaram : జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చు : జీఎం షాలెం రాజు