Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి హుండీలను దేవస్థానం అధికారులను గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా రూ.4.17 కోట్ల ఆదాయం నగదు రూపేణ ఆదాయం సమకూరిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయం గత 27 రోజుల్లో భక్తులు (జూన్ 27 నుంచి జులై 23 వరకు) సమర్పించిన హుండీల ద్వారా రూ.4,17,61,215 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. అలాగే, 225 గ్రాముల 600 మిల్లీగ్రాముల బంగారు, 11 కిలోలకుపైగా వెండిని భక్తులు కానుకల రూపంలో సమర్పించారన్నారు.
అలాగే 475 యూఎస్ డాలర్లు, 70 యూఏఈ దిర్హమ్స్, 1300 ఓమన్ బైసా, 155 కెనడియన్ డాలర్స్, 305 ఆస్ట్రేలియన్ డాలర్లు, 40 ఇంగ్లాండ్ పౌండ్స్, 5 సింగపూర్ డాలర్స్, 50 న్యూజిలాండ్ డాలర్స్, 5 స్కాట్లాండ్ పౌండ్స్, 30 ఈ-రోస్, ఒకటి సౌదీ రియాల్స్, 51 ఖతర్ రియాల్స్, ఒకటి మలేషియా రింగిట్స్, 200 ఇథియోపియన్ బిర్, 220 శ్రీలంక డాలర్లు, 160 నేపాల్ రూపాయలు వచ్చినట్లు వివరించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీలను లెక్కించినట్లు ఈవో వివరించారు. కార్యక్రమంలో ఏఈవో ఆర్ రమణమ్మతో పాటు పలు విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.