జహీరాబాద్, జూలై 24 : తెలంగాణకు భవిష్యత్తు ఆశా కిరణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్ రావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలసి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ బ్రాండ్‌ని విశ్వావ్యాప్తం చేసిన కేటీఆర్ భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకొని ప్రజలు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, పీఏసీఎస్ చైర్మన్ మచ్చేందర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బండి మోహన్, మాజీ పట్టణ అధ్యక్షుడు మోహిద్దీన్, మాజీ కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు రాకేష్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు హీరు రాథోడ్, బీసీ సెల్ అధ్యక్షుడు అమిత్ కుమార్, మాజీ కోహీర్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రవి కిరణ్, మాజీ మొగుడంపల్లి మండల ఫోరం అధ్యక్షుడు సురేష్, మాజీ సర్పంచ్‌లు చిన్న రెడ్డి, అబ్రహం, విజయ్, జగదీష్, నాయకులు పర్వేజ్ పటేల్, సాయిద్, శంకర్, వీర్ శెట్టి, చంద్ర కాంత్ రెడ్డి, రాథోడ్, భీమ్ రావు నాయక్, అభిషేక్ రెడ్డి, బీఆర్ఎస్వీనాయకులు పర్శరామ్, అశోక్ రెడ్డి, ఫయాజ్,లావణ్ సందీప్, ప్రవీణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.