Sarpanches | రాయపోల్, జనవరి 07 : గ్రామాల అభివృద్ధిలో నూతన సర్పంచులు భాగస్వాములు కావాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఇటివలే నూతనంగా గెలుపోందిన సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా బాబు నాయక్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు సర్పంచులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలు ఓటుతో గెలిపించిన సందర్భంగా ప్రతి గ్రామంలో సర్పంచులు సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని.. పరిసరాలు పరిశుభ్రమైన గ్రామాలుగా ఉండేందుకు నూతనంగా గెలుపొందిన సర్పంచులు కృషి చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సర్పంచులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందరూ సహకారం అందించాలని పేర్కొన్నారు. రాయపోల్ మండలంలోని 19 గ్రామ పంచాయతీలను ఆదర్శంగా అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిలుముల శ్రీనివాస్, మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నరేష్, ఏపీవో రాములు, ఏపీఏం యాదగిరి, మిషన్ బగీరథ ఇంట్రా ఏఈ ఆబినయ్, అంగన్ వాడీ సూపర్ వైజర్ షబానా, పీఆర్ఏఈ రాము కుమార్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Khammam Rural : అభిమాన నాయకుడు కేటీఆర్‌ను కలిసిన అనిల్ నాయక్
Dhurandhar: దూసుకెళ్తున్న ధురంధర్.. రూ.1240 కోట్లు వసూల్
Donald Trump | అది జరగాలంటే చైనా, రష్యాతో సంబంధాలు తెంచుకోవాలి.. వెనెజువెలాకు ట్రంప్ టీమ్ షరతులు