Donald Trump | అది జరగాలంటే చైనా, రష్యాతో సంబంధాలు తెంచుకోవాలి.. వెనెజువెలాకు ట్రంప్ టీమ్ షరతులు
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన రెండో దఫా పాలనలో విదేశాంగ విధానం ద్వారా తన ఆకాంక్షలను తీర్చుకునే పనిలో పడ్డారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన రెండో దఫా పాలనలో విదేశాంగ విధానం ద్వారా తన ఆకాంక్షలను తీర్చుకునే పనిలో పడ్డారు. రాత్రికి రాత్రి వెనెజువెలా (Venezuela)పై కమాండో దాడి జరిపి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బందీలుగా అమెరికాకు తరలించి ట్రంప్ తన పంతం నెరవేర్చుకున్నారు. అంతటితో ఆగని ట్రంప్.. దక్షిణ అమెరికా దేశాన్ని మొత్తం తానే నియంత్రిస్తున్నట్లు ప్రకటించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రభుత్వానికి ట్రంప్ కీలక హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.
వెనెజువెలా కొత్త నాయకత్వం చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాదు, చమురు ఉత్పత్తిలో అమెరికాతో మాత్రమే భాగస్వామ్యం చేయాలని, ముఖ్యంగా హెవీ క్రూడ్ ఆయిల్ విక్రయాల్లో అమెరికాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
వెనెజువెలా చమురు ఉత్పత్తిని పెంచుకోవాలంటే తాను పెట్టిన ఈ షరతులు పాటించాలని ట్రంప్ టీమ్ స్పష్టం చేసినట్లు ఏబీసీ న్యూస్ నివేదిక వెల్లడించింది. ‘మొదట ఆ దేశం (వెనెజువెలా) చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలి. రెండోది.. వెనెజువెలా చమురు ఉత్పత్తిలో అమెరికాతో ప్రత్యేక భాగస్వామిగా ఉండేందుకు, భారీ ముడి చమురు విక్రయాల్లో అమెరికాకు అనుకూలంగా ఉండేందుకు అంగీకరించాలి’ అని ట్రంప్ టీమ్ (Team Trump) షరతులు పెట్టినట్లు సదరు నివేదిక పేర్కొంది.
Also Read..
Donald Trump: 50 మిలియన్ బ్యారెళ్ల ఇంధనం అమ్మనున్న వెనిజులా: డోనాల్డ్ ట్రంప్
Donald Trump | ఆ 5 దేశాలపై ట్రంప్ కన్ను.. వెనెజువెలా తర్వాత వాటిపైనే దృష్టి
గ్రీన్‌లాండ్‌పై అమెరికా దాడి చేస్తే నాటో పతనమే
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

