Harish Rao | సిద్దిపేట, అక్టోబర్ 22: సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్కల, వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల, మక్కలకు కొనుగోలు కేంద్రాలను ఆలస్యం చేసింది . రైతులు ఇప్పటికే దళారులకు రూ.1600కు అమ్ముకోవడం జరిగిందన్నారు.
ప్రతీ ఎకరానికి 18 క్వింటాళ్లు మాత్రమే మక్కలు కొంటాం అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కోతలు పెడుతున్నావని ప్రశ్నించారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి. దొంగలు పడ్డంక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు పంట అంతా అమ్ముకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. ఇప్పటికే 14 వేల క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేశారు.
రేవంత్ రెడ్డి పాలన ఆగమాగం.. సగం సగం, ఏదైనా పథకం కొనదాకా వెళ్లిందా..? అని ప్రశ్నించారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని.. అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి డిమాండ్ చేశారు.
Tejashwi Yadav: జీవికా దీదీలకు 30 వేల జీతం: తేజస్వి యాదవ్
Road Accident: ఢీకొన్న రెండు బస్సులు.. 63 మంది మృతి
Nidamanoor : రైతులకు మద్దతు ధరే లక్ష్యం : అంకతి సత్యం