Ration Rice | రాయపోల్, నవంబర్ 25 : నిరుపేదలకు మూడు పూటల అన్నం తినాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంటే కొంతమంది అక్రమార్కులు వ్యాపారం చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం కేంద్రంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ రేషన్ బియ్యం దందాను రైస్‌మిల్ వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వ్యాపారులపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి రైస్ మిల్లులను సీజ్ చేసినప్పటికి బియ్యం దందాను వ్యాపారులు దర్జాగానే కొనసాగిస్తున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదని విమర్షలు వస్తున్నాయి. రాయపోల్ మండల, జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అటు వ్యాపారులు, ఇటు రైస్ మిల్లుల వ్యాపారులు పీడీఎస్ బియ్యం చందాను రాత్రివేళ్లలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తుండడంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.
వివిధ ప్రాంతాల నుంచి ఏజెంట్లు..
గ్రామాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని రైస్ మిల్లుల వ్యాపారుల కన్నుసన్నల్లో అక్రమ రేషన్ బియ్యం దందాను జోరుగా నడుపుతున్నారు. పేదల ఆకలిని తీర్చెందుకు ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తున్నప్పటికి యదేచ్చగా పీడీఏస్ బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. సంబంధిత సివిల్ సప్లై అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్లోకి తరలిపోతున్నాయి.
కాగా గత మూడు రోజుల క్రితం రాయపోల్ మడంలంలోని గుర్రల పోప వద్ద సమీపంలోని రామారంలో గల రైస్ మిల్లో అక్రమంగా పీడీఎస్ బియ్యంను బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్న క్రమంలో రాయపోల్ పోలీసులు పట్టుకోని సివిల సప్లై అధికారులకు అప్పగించారు. దీంతో సివిల్ సప్లయి డిప్యూటి తహశీల్దార్ రాజిరెడ్డి మంగళవారం పోలీస్ స్టేషన్ వద్ద గల రేషన్ బియ్యం వాహనాన్ని స్వాధీనం చేసుకొని విచారణ చేయగా.. అందులో ఉన్న 54 క్వింటాళ్ల 85 కిలోల రేషన్ బియ్యాన్ని గజ్వేల్ గోడౌన్‌కు తరలించి.. అందుకు సంబంధించిన వాహనాన్ని, డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో, మండలంలో రైస్ మీల్ వ్యాపారులైన ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యంను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Harish Rao | నీకు మహిళలు ఎందుకు ఓటెయ్యాలి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Palash Muchhal | మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త