Palash Muchhal | భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) మళ్లీ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం పలాశ్ వైరల్ ఇన్ఫెక్షన్తో సాంగ్లీలోని ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఉదయం ముంబైలోని ఎస్వీఆర్ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన టీమ్ తెలిపింది.
కాగా, ఆదివారం స్మృతి-పలాశ్ వివాహం జరగనుండగా.. క్రికెటర్ తండ్రి హఠాత్తుగా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో పెళ్లిని వాయిదా వేశారు. ఆ కాసేపటికే పలాశ్ కూడా అస్వస్థతకు గురికావడంతో ఆయన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, స్మృతి తండ్రికి, పలాశ్కు మంచి అనుబంధం ఉందని.. ఆదివారం అనారోగ్యానికి గురవడాన్ని తట్టుకోలేకపోయిన పలాశ్ దాదాపు నాలుగు గంటల పాటు ఏడుస్తూనే ఉన్నారని అతడి తల్లి పేర్కొంది. దాంతోనే పలాశ్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలిపింది. దానికి తోడు వరుస ప్రయాణాలు, సంగీత్, వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో సరైన నిద్ర లేకపోవడం, ఇతర కారణాల వల్ల పలాశ్ ఒత్తిడికి లోనై అస్వస్థతకు గురైనట్లు అతడి టీమ్ పేర్కొంది.
Also Read..
Smriti Mandhana | స్మృతి మంధాన-పలాశ్ వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు : పలాక్ ముచ్చల్
Zubeen Garg | జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించలేదు.. ఆయన్ని హత్య చేశారు : సీఎం హిమంత శర్మ