ముంబై : భారత క్రికెటర్ స్మృతి మంధాన కుటుంబానికి మరో ఇబ్బంది! ఇప్పటికే తండ్రి గుండెపోటుతో పెండ్లి నిరవధికంగా వాయిదా పడగా, తాజాగా మంధాన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ అస్వస్థతకు గురయ్యాడు. వైరల్ ఇన్ఫెక్షన్కు తోడు ఎసిడిటీతో బాధపడుతున్న ముచ్చల్ దగ్గరలోని ప్రైవేట్ దవాఖానలో చేరినట్లు తెలిసింది. ముచ్చల్‌ను పరిశీలించిన వైద్యులు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
వైద్య పరీక్షల తర్వాత ముచ్చల్ దవాఖాన నుంచి తాను బస చేసిన హోటల్‌కు చేరుకున్నట్లు ఇంగ్లిష్ వార్తాసంస్థ తమ కథనంలో తెలిపింది. ఇదిలా ఉంటే తండ్రితో పాటు కాబోయే భర్త అనారోగ్యానికి గురి కావడంతో స్మృతి మంధాన తన పెండ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా నుంచి తొలిగించింది. దీనికి తోడు సహచర క్రికెటర్లు జెమీమా, శ్రేయాంక తమ తమ అకౌంట్ల నుంచి పోస్ట్‌లను డిలీట్ చేశారు.