Smriti Mandhana | భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం చివరి నిమిషంలో ఆగిపోయిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా వాయిదా పడింది. ఆమె తండ్రి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. ఆ తర్వాత స్మృతికి కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వరుస పరిణామాలతో తేరుకోకముందే మంధాన తన సోషల్ మీడియా ఖాతాలో వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతోపాటూ ఎంగేజ్మెంట్ వీడియోని డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఆమె ఇచ్చిన ఈ ట్విస్ట్‌కు నెటిజన్లు, అభిమానులు షాక్ అయ్యారు. అసలేం జరుగుతోందో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిణామాల వేళ పలాశ్ సోదరి, సింగర్ పలాక్ ముచ్చల్ (Palak Muchhal) ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ షేర్ చేశారు. ‘స్మృతి మంధాన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా స్మృతి-పలాశ్ వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు. ఇలాంటి సమయంలో ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ అవుతోంది.
Also Read..
Smriti Mandhana | పెళ్లి ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసిన స్మృతి మంధాన.. అసలేం జరుగుతోంది..?