సాంగ్లీ (మహారాష్ట్ర) : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదాపడింది. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన ఆదివారం అనారోగ్యానికి గురవడంతో పెండ్లిని నిరవధికంగా వాయిదా వేసినట్టు ఆమె మేనేజర్ తెలిపారు.
ఆదివారం స్మృతి-పలాశ్ వివాహం జరగాల్సి ఉండగా ఉదయం ఆమె తండ్రికి గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన స్థానికంగా ఉన్న దవాఖానాకు తరలించారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపిన స్మృతి మేనేజర్.. తండ్రి పూర్తిస్థాయిలో కోలుకునేదాకా ఆమె తన వివాహాన్ని వాయిదావేయాలని నిర్ణయించుకున్నట్టు మీడియాకు వెల్లడించాడు.