Smriti Mandhana | భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం చివరి నిమిషంలో ఆగిపోయిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా వాయిదా పడింది. ఆమె తండ్రి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. ఆ తర్వాత స్మృతికి కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో క్రికెటర్ పెళ్లి విషయంలో తాజాగా మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది.
నిన్నటి వరకూ పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన స్మృతి మంధాన.. ఇప్పుడు వాటిని డిలీట్ చేసింది. ఆమె ఇన్‌స్టా ఖాతాలో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను తొలగించింది. అంతేకాదు మంధాన తన నిశ్చితార్ధం ఉంగరాన్ని చూపిస్తూ తన టీమ్మేట్స్తో చేసిన ప్రత్యేక వీడియోని కూడా ఇన్‌స్టా ఖాతా నుంచి తొలగించింది. ఈ విషయంపై స్మృతి, ఆమె ఫ్యామిలీ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. దీంతో అసలేం జరుగుతోందో తెలియక అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు మంధాన, పలాశ్ ముచ్చల్. తమ సంప్రదాయం ప్రకారం వివాహ క్రతువులోని హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు సంబురంగా జరిగాయి. భారత క్రికెటర్లు పలువురు మంధానతో కలిసి హుషారుగా పెళ్లి పనుల్లో పాల్గొన్నారు. ఇక మరికాసేపట్లో వివాహం జరుగుతుందనంగా.. అనూహ్యంగా వాయిదా పడింది. ఆమె తండ్రి శ్రీనివాస్ (Sreenivas) అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో.. వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.
తండ్రికి అస్వస్థత కారణంగా మంధాన – పలాశ్ ముచ్చల్ తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆదివారం మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా (Tuhin Mishra) మీడియాకు వెల్లడించారు. తండ్రి పూర్తిస్థాయిలో కోలుకునేదాకా ఆమె తన వివాహాన్ని వాయిదావేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. మరోవైపు స్మృతి తండ్రి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఆ తర్వాత పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) కూడా అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. వైరల్ ఇన్ఫెక్షన్తోపాటూ ఎసిడిటీ పెరగడంతో పలాశ్ను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి (Hospital) తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. చికిత్స తర్వాత పలాశ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు సమాచారం.
Also Read..
“Smriti Mandhana | వరల్డ్ కప్ గెలిచిన చోటే స్మృతి మంధానకు ప్రపోజ్ చేసిన ప్రియుడు.. వీడియో”
“Smriti Mandhana | కాబోయే భర్తకూ అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిన పలాశ్ ముచ్చల్”
“Smriti Mandhana | సంగీత్‌లో అదరగొట్టిన మంధాన.. భారత క్రికెటర్ల డాన్స్‌కు ఆహుతులు ఫిదా..!”
“Smriti Mandhana | మంధాన హల్దీ వేడుక.. టీమిండియా క్రికెటర్ల సందడి చూశారా..!”