Palash Muchhal | భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. తన చిరాకల ప్రియుడు పలాశ్ ముచ్చల్ (Palash Muchhal)తో కలిసి త్వరలోనే ఏడడగులు వేయబోతుంది. అయితే స్మృతికి పలాష్ ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే మందన్నా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పంచుకుంది. అయితే స్మృతికి ప్రపోజ్ చేసిన వీడియోను తాజాగా పంచుకున్నాడు పలాశ్. ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలోనే స్మృతికి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ను ఇచ్చాడు.
స్మృతి కళ్లకి గంతలు కట్టి స్టేడియం దగ్గరికి తీసుకువచ్చిన పలాశ్.. అనంతరం మోకాళ్లపై కూర్చుని ఉంగరాన్ని అందించగా ఆశ్చర్యానికి లోనైన మంధాన వెంటనే ఆ ప్రపోజల్‌ను అంగీకరించింది. అనంతరం ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని తమ ప్రేమ బంధాన్ని మరింత దృఢం చేసుకున్నారు. ఈ మధురమైన క్షణాలను పలాశ్ ముచ్చల్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. క్రీడా, సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.