Smriti Mandhana | భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (Palash Muchhal)తో స్మృతి వివాహం ఆదివారం సాయంత్రం జరగనుండగా.. ఉదయం ఆమె తండ్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో పెళ్లి వాయిదా పడింది. అయితే, ఆమె తండ్రే కాదు.. కాబోయే భర్త పలాశ్ కూడా అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. వైరల్ ఇన్ఫెక్షన్తోపాటూ ఎసిడిటీ పెరగడంతో పలాశ్ను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి (Hospital) తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. చికిత్స తర్వాత పలాశ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు సమాచారం.
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు మంధాన, పలాశ్ ముచ్చల్. తమ సంప్రదాయం ప్రకారం వివాహ క్రతువులోని హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు సంబురంగా జరిగాయి. భారత క్రికెటర్లు పలువురు మంధానతో కలిసి హుషారుగా పెళ్లి పనుల్లో పాల్గొన్నారు. ఇక మరికాసేపట్లో వివాహం జరుగుతుందనంగా.. అనూహ్యంగా వాయిదా పడింది. ఆమె తండ్రి శ్రీనివాస్ (Sreenivas) అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో.. వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రికి అస్వస్థత కారణంగా మంధాన – పలాశ్ ముచ్చల్ తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆదివారం మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా (Tuhin Mishra) మీడియాకు వెల్లడించారు. తండ్రి పూర్తిస్థాయిలో కోలుకునేదాకా ఆమె తన వివాహాన్ని వాయిదావేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. మరోవైపు స్మృతి తండ్రి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Also Read..
ఐపీబీఎల్లో హైదరాబాద్ టీమ్ ఎంపిక