ముంబై : ఇండియన్ పికిల్‌బాల్ లీగ్(ఐపీబీఎల్)-2025 సీజన్ కోసం హైదరాబాద్ రాయల్స్ టీమ్ తమ జట్టును ఆదివారం ప్రకటించింది. అంతర్జాతీయ అనుభవం కల్గిన అమెరికా ప్లేయర్లు బెన్ న్యూవెల్, మేగన్ ఫడ్జ్‌తో పాటు భారత్‌కు చెందిన దివ్యాంశు కటారియా, స్నేహల్ పాటిల్ వంటి ప్లేయర్లతో హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తున్నది.
సింగిల్స్, డబుల్స్‌లో సత్తాచాటిన బెన్ న్యూవెల్ను తీసుకున్న రాయల్స్ టీమ్ ఆ తర్వాత మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న మేగన్ వైపు మొగ్గుచూపింది. జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తేజస్ గులాటీ, శ్రేయ చక్రవర్తిని రాయల్స్ తమ జట్టులోకి తీసుకుంది.