ఢాకా : మహిళల కబడ్డీ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఈ టోర్నీ ఫైనల్స్‌కు ప్రవేశించింది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీస్‌లో భారత్.. 33-21తో ఇరాన్‌ను చిత్తుచేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
గ్రూప్ స్టేజ్‌లో అపజయమన్నదే లేకుండా ఆడిన భారత అమ్మాయిలు.. నాకౌట్ దశలోనూ అదే ఆటతీరుతో ఇరాన్‌ను ఇంటికి పంపించారు.