Ramzan Tohfa | తొగుట, మార్చి 30: ఆత్మీయత, మత సామరస్యానికి రంజాన్ ప్రతీక అని తాజా మాజీ ఎంపీటీసీ వేల్పుల స్వామి ముదిరాజ్ అన్నారు. రంజాన్ పర్వదినంను పురస్కరించుకొని మండల పరిధిలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 32 ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు వస్తువులు ఇవ్వడం జరిగింది..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు. పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. రంజాన్ మాసంలో మతసామరస్యానికి ప్రతీక. మత సామరస్య భావం పెంపొంది, ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మైనార్టీ అధ్యక్షుడు సైఫుద్దీన్, యాకూబ్, మొయినుద్దీన్చ ఖలీల్, పాషాబాయ్. అక్బర్, గౌస్ పాషా, షరీఫ్, రుక్కు భాయ్, ఫరీద్ బాయ్, సల్మాన్ ఖాన్, షారుక్, అర్షద్ బబుల్, బాయ్, బీఆర్ఎస్ గ్రామ యువ నాయకులు వెంకటేష్ గౌడ్, వైకుంఠం గౌడ్, ప్రభాకర్ రెడ్డి, స్వామి గౌడ్, ఎల్లా గౌడ్, కిషన్, భాస్కర్, రాము, కృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్