gangula | కమాన్ చౌరస్తా, మార్చి 30 : వృత్తి విద్యా కోర్సులతో విద్యార్థుల భవిష్యత్తు బంగారం మాయమవుతుందని, విద్యార్థులు భవిష్యత్తు ఉన్న కోర్సులను ఎంచుకొని రాణించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ లో రేయాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కాలేజీలో ఉన్న అధునాతన సదుపాయాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్య పూర్తైన అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలని యజమాన్యానికి సూచించారు. అనంతరం కళాశాల చైర్మన్ మహేందర్, ప్రిన్సిపాల్ అనూష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇది రెండో బ్రాంచ్ అని, ఒకటి నిజామాబాదులో ఉందని తెలిపారు. అదేవిధంగా కాలేజీ లో అధునాతనమైన ల్యాబ్ కలిగి ఉన్నట్టు తెలిపారు.
విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు. అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సల్ల శారద- రవీందర్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, నాయకులు తోట కోటేశ్వర్ పటేల్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.