అశ్వాపురం, మార్చి 3 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బండారి పుల్లయ్య కాంగ్రెస్ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించాడు. పుల్లయ్య భార్య శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లయ్యను కొన్నిరోజులుగా అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఊసా అనిల్, లంకమల్ల కొండలరావు వేధిస్తున్నారు.
మంగళవారం అశ్వాపురం పోలీస్స్టేషన్లో పుల్లయ్యపై కొండలరావు తప్పుడు కేసు పెట్టి ఇంటికి పోలీసులను పంపి బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన పుల్లయ్య అదేరోజు సాయంత్రం పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి పుల్లయ్యను మణుగూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తన భర్తను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు శ్రీలత పేర్కొన్నారు.