Delhi Police : కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(KGP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేజీపీ తలపెట్టిన ‘ఛలో పార్లమెంట్’కు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. జూలై 20, సోమవారం నాడు ఛలో సంసద్ (ఛలో పార్లమెంట్) కోసం ఎవరూ తమ అనుమతి కోరలేదని, పోలీసులు ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నందున సీజేపీ తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో అమరణ దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కాక్రోచ్ జనతా పార్టీకి మరో షాకిచ్చారు. వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసినందున జూలై 20, సోమవారం సీజేపీ పిలుపునిచ్చిన ఛలో పార్లమెంట్‌కు అనుమతి లేదని పోలీసులు చెప్పేశారు.
🚨Prohabitory orders u/s 163 BNSS are in force in New Delhi District except designated protest site at Jantar Mantar Road.
Further, no permission has been sought or granted for any proposed march to Parliament on 20 July 2026.
Citizens are advised not to participate in any… pic.twitter.com/aUio5slVM6
— Delhi Police (@DelhiPolice) July 19, 2026
ప్రస్తుతం న్యూ ఢిల్లీ జిల్లాలో భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163 ప్రకారం నిషేధాంజ్ఞలు అమలులో ఉంటాయని ఆదివారం ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాబట్టి.. ఈ ఆంక్షలు ఉన్నందున జంతర్ మంతర్ మినహా ఇతర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు, ఐదుగురి కంటే ఎక్కువమంది గుంపులుగా ఉండడం నిషేధమని పేర్కొన్నారు. ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘించినట్టైతే బీఎన్ఎస్ సెక్షన్ 223 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
#WATCH | Delhi: On reports of a proposed march to Parliament by CJP on 20th July, tomorrow, DCP New Delhi, Sachin Sharma says, “In view of reports of proposed march to Parliament by CJP on 20th July, it is categorically clarified that no such application for permission has been… pic.twitter.com/QxtejC457O
— ANI (@ANI) July 19, 2026