Kaziah Liz Mejo : ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2026 పోటీల్లో కజియా లిజ్ మెజో(Kaziah Liz Mejo) విజేతగా నిలిచింది. జైపూర్‌లోని జీ స్టూడియలో జరిగిన అందాల పోటీల గ్రాండ్ ఫినాలేలో ఈ కేరళ అమ్మాయిని కిరీటం వరించింది. టైటిల్ పోరులో ఏకంగా 52 మందిని ఓడించిన 19 ఏళ్ల కజియా తన కలను సాకారం చేసుకుంది. మూడేళ్లుగా ఈ కిరీటం కోసం శ్రమించిన తను ఇప్పుడు ప్రపంచాన్ని జయించినంత సంబురంలో ఉంది.
భారతదేశ వ్యాప్తంగా అందగత్తెలు పాల్గొన్న మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోటీల్లో కజియా లిజ్ మెజో విజేతగా మురిసింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో అందంతో పాటు తెలివితేటలతోనూ జడ్జిలను మెప్పించిన కజియా.. 19 ఏళ్లకే కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. ఈ టైటివల్ గెలుపొందిన మొట్టమొదటి కేరళ కుట్టిగా కజియా రికార్డు నెలకొల్పింది. 52 మందిని వెనక్కినెట్టి అగ్రస్థానం సాధించిన ఆమెకు మాజీ మిస్ యూనివర్స్ ఇండియా మనికా విశ్వకర్మ కిరీటాన్ని ప్రదానం చేసింది. ఆహుతుల కరతాళధ్వనులు, కెమెరా వెలుగులు మధ్య కజియా తలపై కిరీటాన్ని పెట్టింది మనికా.
Jaipur : Kerala Teen Kaziah Liz Mejo Crowned Miss Universe India 2026
Kaziah, a law student and model from Mavelikkara, Kerala, won Miss Universe India 2026 at the Jaipur finale on August 23, beating 52 finalists at Zee Studios in Rajasthan.
pic.twitter.com/39sJOc41k6— Wellness & Wonder (@DIYLifeHackslab) August 24, 2026
దేశపు తొలి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశీ రౌతేలా, మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా, పర్యావరణవేత్త.. సినిమా ప్రొడ్యూసర్ ప్రగ్యా కపూర్, మాజీ మిస్ ఇండియా యూనివర్స్, మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీలు ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుపొందడంతో తన మూడేళ్ల కల నిజమైందని కజియా చెప్పింది. ‘ఇప్పుడు నేను ప్రపంచం మీద ఉన్నట్టు అనిపిస్తోంది. ఇదొక మధుర క్షణం. ఈ సందర్భం కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా.ఈ అందాల కిరీటాన్ని మా స్వరాష్ట్ర కేరళకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని భావోద్వేగానికి లోనైంది అందగత్తె. అమెరికాలోని పుయెట్రో రికోలో నవంబర్‌లో జరుగనున్న 75వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో భారత ప్రతినిధిగా కజియా పాల్గొననుంది.
#WATCH | Jaipur, Rajasthan | Grand Finale of Miss Universe India 2026 | Miss Universe India 2026 Winner Kaziah Liz Mejo says, “I feel so on top of the world. This is such an iconic moment, and the moment that I have worked for over three years now. I am so incredibly happy that I… pic.twitter.com/6IdSF1bpM3
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 24, 2026
మోడల్‌గా రాణిస్తున్న కజియా 2007లో జన్మించింది. అబూధాబీలో పెరిగిన తను అక్కడి ఎమిరేట్స్ నేషనల్ స్కూల్, అబుధాబీ ఇండియన్ స్కూల్లో చదివింది. ప్రస్తుతం లా చేస్తూనే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది. మరో విషయం.. ఐదేళ్ల వయసు నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న కజియాకు పాటలు పాడడం, డ్రమ్స్, వయోలిన్ వాయించడం వచ్చు. మలయాళంలో షైలాక్ సినిమాలో నటించిన ఈ అమ్మాయి.. మిస్ టీన్ ఇంటర్నేషన్ 2025లో తొలి రన్నరప్‌గా నిలిచింది.