హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ అండర్-17 చెస్ చాంపియన్‌షిప్‌లో మాస్టర్ నిదీష్ శ్యామల్, యశ్వి జైన్ విజేతలుగా నిలిచారు. బాచుపల్లిలోని వికాస్ ది కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీలో భాగంగా బాయ్స్ కేటగిరీలో 174 మంది, గర్ల్స్ విభాగంలో 48 మంది తలపడ్డారు.
బాయ్స్ నుంచి నిదీశ్ 6 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను గెలుచుకోగా గర్ల్స్ విభాగంలో యశ్వి (5 పాయింట్లతో) విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో గెలిచిన ప్లేయర్లు జమ్మూకశ్మీర్‌లో జరుగబోయే జాతీయ అండర్-17 చెస్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్నారు.