Sonam Wangchuk : ‘ఛలో పార్లమెంట్’కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) భార్య అన్మోగ్ గీతాంజలి(Anmog Geetanjali) కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో రెండు షరతులకు అంగీకరిస్తే తన భర్త సోనమ్ దీక్షను విరమించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆదివారం ఆమె తెలిపారు. సోనమ్‌ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి ప్రైవేట్ దవాఖానకు తరలించేందుకు హైకోర్టు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో.. భర్తతో మాట్లాడిన గీతాంజలి రెండు షరతులు మీడియా ముందుంచారు.
మూడు వారాలకు పైగా అమరణ దీక్ష చేసి.. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు సోనమ్ వాంగ్‌చుక్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీలో జవాబుదారీతనం కోరుతూ దీక్షకు పూనుకున్న ఆయన విరమణకు ప్రభుత్వానికి రెండు షరతులు విధించారు. భార్య అన్మోగ్ గీతాంజలి ద్వారా తన కండీషన్స్‌ను తెలియజెప్పారు సోనమ్.
VIDEO | Delhi: At Jantar Mantar, Sonam Wangchuk’s wife Gitanjali Angmo says, “Sonam will end his hunger strike tomorrow if political leaders meet him at hospital and assure him that they will raise the issue of education accountability during Parliament session.”
(Full video… pic.twitter.com/a2tUbotOdi
— Press Trust of India (@PTI_News) July 19, 2026
ఇంతకూ ఆ రెండు షరతులు ఏంటంటే.. ‘రాజకీయ నాయకులు ఆస్పత్రికి వచ్చి ఆయనను కలవాలి. రెండోది.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం గురించి చర్చించాలి’. ఈ రెండు డిమాండ్స్‌కు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే సోనమ్ తన దీక్షను విరమిస్తారని గీతాంజలి పేర్కొన్నారు.
నీట్ ఎగ్జామ్ లీకేజీకి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్న కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 21 రోజుల దీక్ష తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశశించింది.

దాంతో.. పోలీసులు బలవంతంగా సోనమ్‌ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే.. తన భర్తను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని ఆయన ఇప్పటికీ దీక్షలోనే ఉన్నారని గీతాంజలి మీడియాకు తెలిపారు. సీజేపీ పిలుపుమేరకు జూలై20న ఛలో పార్లమెంట్లో పాల్గొంటామని, ఒకవేళ సోనమ్ రాని పక్షంలే తాను నాయకత్వం వహిస్తానని కూడా ఆమె స్పష్టం చేసిన విషయం తెలిసిందే.