రైతుబంధు ఏది రేవంత్?
రైతుబంధు నిధుల విడుదలలో జాప్యంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి తీరును తూర్పారబట్టారు.
- మార్చి మూడు దాటినా రాలేదు?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రైతుబంధు నిధుల విడుదలలో జాప్యంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి తీరును తూర్పారబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మేలు జరుగుతుందని నమ్మబలికి, ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు.
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడాదికి మూడు పంటలకు రైతుబంధు వేయాలని డిమాండ్ చేసిన రేవంత్‌రెడ్డి, నేడు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక పంటకు కూడా సాయం అందిస్తలేడు’ అని మండిపడ్డారు. డిసెంబర్లోనే రైతుల ఖాతాల్లో చేరాల్సిన రైతుబంధు నిధులు, మార్చి మూడో తారీఖు వచ్చినా రూపాయి కూడా విడుదల కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుబంధుకు ఈ రాబందు కాంగ్రెస్ మంగళం పాడుతుందని కేసీఆర్ ముందే హెచ్చరించారని, ఆయన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని పేరొన్నారు. తెలంగాణ రైతాంగం మేలోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గమనించాలని పిలుపునిచ్చారు. ఈ మోసపూరిత పాలనను నిలదీయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

