న్యూఢిల్లీ : దేశ విద్యార్థులు మూడు ప్రధాన డిమాండ్లను సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రకటనలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మరో వీడియో విడుదల చేశారు. పరీక్షల్లో సంస్కరణల కోసం ప్రముఖ సాంకేతిక నిపుణులు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఆధ్వర్యంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా విశ్వసనీయత ఉండేలా సంస్కరణలు చేపడుతామని తెలిపారు. పరీక్ష పేపర్ల లీకేజీని అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని.. సోమవారం లోక్‌సభలో ఈ మేరకు బిల్లు ప్రవేశపెడుతామని వెల్లడించారు. సాంకేతికతను వాడుకుని పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీ నిందితులు ఇప్పటికే జైల్లో ఉన్నారని.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వారికి కఠిన శిక్షలు పడేలా చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీలో నందన్ నీలేకనితో పాటు ఇస్రో మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపస్ దేకా, ఐఐటీ చెన్నై డైరెక్టర్ వి.కామకోటి, మాజీ విద్యశాఖ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణులు అమృత్లాల్ మీనా సభ్యులుగా ఉన్నారు.
ఇవన్నీ తాత్కాలికమే: కాంగ్రెస్
ఈ కమిటీపై కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ.. ‘టాస్క్‌ఫోర్స్‌ను నియమించడం అంటే.. కోలుకోలేని విధంగా దెబ్బతిన్న మోదీ ప్రతిష్టను సరిదిద్దడానికి చేస్తున్న భారీ ప్రయత్నం. 2024లో నీట్ లీక్ అయినప్పుడు కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ 101 సిఫారసులు చేస్తే.. వాటిని పూర్తిగా అమలు చేయకముందే మరో కమిటీని వేస్తున్నారు. రెండేండ్లుగా ఎన్టీయేలో పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్‌ను కూడా నియమించలేదు. ఇవన్నీ తాత్కాarకమే’ అంటూ విమర్శించారు.