కౌలాలంపూర్‌లో ‘గిఫ్ట్ ఏ స్మైల్’
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురసరించుకుని ఆయన పిలుపునిచ్చిన ‘గిప్ట్ ఏ స్మైల్' సేవా కార్యక్రమాన్ని మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా నిర్వహించారు.
- కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహణ
హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురసరించుకుని ఆయన పిలుపునిచ్చిన ‘గిప్ట్ ఏ స్మైల్’ సేవా కార్యక్రమాన్ని మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలు, కేక్ కటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వకుండా, అనాథలకు చేయూతనివ్వాలనే కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఓ అనాథ శరణాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనాథ చిన్నారులకు పండ్లు, స్టేషనరీ పంపిణీ చేయడంతోపాటు శరణాలయం నిర్వహణ కోసం ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి కుర్మ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కేటీఆర్ జన్మదినాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం తమకు ఎంతో ఆనందదాయకమని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా వ్యవస్థాపకుడు చిట్టి చిరుత, ఉపాధ్యక్షుడు అరుణ్ మునిగల, కార్యదర్శి సందీప్‌కుమార్ లగిశెట్టి, కమిటీ సభ్యులు సత్యనారాయణరావు నడిపెల్లి, హరీశ్ గుడిపాటి, సురేష్, శ్యామ్, పూర్ణచందర్రావు, క్రాంతి, అభినయ్, కృష్ణ, సందీప్ గాజెంగి, గౌతమ్, శేషి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

