ఇస్నాపూర్ వైస్ చైర్‌పర్సన్‌పై వేటు
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల మాధవి కాంగ్రెస్ పార్టీ విప్ ధిక్కరించడంతో ఎన్నికల అధికారి ఆమెను కౌన్సిల్‌కు అనర్హురాలిగా ప్రకటించారని మున్సిపల్ కమిషనర్ వెంకటకిషన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- విప్ ధిక్కారంపై అధికారి చర్యలు
పటాన్చెరు రూరల్, మార్చి 3 : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల మాధవి కాంగ్రెస్ పార్టీ విప్ ధిక్కరించడంతో ఎన్నికల అధికారి ఆమెను కౌన్సిల్‌కు అనర్హురాలిగా ప్రకటించారని మున్సిపల్ కమిషనర్ వెంకటకిషన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇస్నాపూర్ పురపాలక సంఘం రెండో సాధారణ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన పట్లోళ్ల మాధవి బీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి మోటే సుమలత చైర్పర్సన్, మాధవి వైస్ చైర్పర్సన్ పదవి ని కైవసం చేసుకున్నారు.
పార్టీ విప్‌ను ధిక్కరించిన మాధవిపై చర్యలు తీసుకోవాలని ఇస్నాపూర్ అథరైజ్డ్ ఎలక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్‌కు డీసీసీ అధ్యక్షురాలు ఫిర్యాదుచేశారు. దీంతో ఎన్నికల నిర్వహణ అధికారి మాధవికి విప్ ధిక్కరణపై షోకాజ్ నోటీస్ జారీచేశారు. ఆమె సమాధానం ఆధారంగా విచారణ జరిపి, మార్చి 2న మున్సిపల్ కౌన్సిల్ సభ్యత్వం నుంచి అనర్హురాలిగా ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ప్రకారం అనర్హత వేసినట్టు కమిషనర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

