Ramzan Celebrations | రాయపోల్ మార్చి 31 : సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఇవాళ రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో చిన్నాపెద్దా అంతా కలిసి ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. దౌల్తాబాద్, రాయపోల్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఇవాళ ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం నూతన వస్త్రాలు ధరించి ర్యాలీగా వెళ్లి ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు కులమతాలకు అతీతంగా అలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండు మండలాల్లో మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.
దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట, దౌల్తాబాద్, ఇందూప్రియల్, ముబారస్పూర్,మల్లేశం పల్లి, గొడుగుపల్లి,ఉప్పర్ పల్లి, హైమద్నగర్, తిరుమలాపూర్, రాయపోల్ మండల పరిధిలోని మంతూర్,అనాజిపూర్. రాయపోల్,సయ్యద్ నగర్, తిమ్మక్క పల్లి, చిన్న మాసంపల్లి, రాంసాగర్, వడ్డేపల్లి, వీరానగర్, రామవరం, కొత్తపల్లి తదితర గ్రామాల్లో రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ సందర్భంగా ఆయల గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు ముస్లిం సోదరులకు ప్రత్యేక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు..
మిరుదొడ్డి, మార్చి 31: ఉమ్మడి మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి మండలాల్లో ఇవాళ ముస్లింలు సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్దాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. అలయ్ బలయ్ తీసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు..
మద్దూరు (ధూళిమిట్ట) సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఖురాన్ సూక్తులను బోధించారు. అనంతరం చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాను ప్రార్థించినట్లు ముస్లిం పెద్దలు తెలిపారు.
కోహెడలో ఘనంగా రంజాన్ వేడుకలు..
కోహెడ మార్చి 31 : కోహెడ మండల కేంద్రంతో పాటు శనిగరం, బస్వాపూర్, సముద్రాల తదితర గ్రామాలలో సోమవారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు నూతన వస్త్రాలను ధరించి మజీద్, దర్గాలలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఒకరికి ఒకరు అలయ్ బలయ్ చెప్పుకున్నారు. కుటుంబ సమేతంగా సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమాలలో మాజీ కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ ఖదీర్, మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.
ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు..
కొమురవెల్లి, మార్చి 31 : మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయం వేకువజామునే స్నానం ఆచరించి కొత్త దుస్తులు ధరించి ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఘనంగా రంజాన్ వేడుకలు..
కొండపాక (కుకునూరుపల్లి), మార్చి 31 : కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లో సోమవారం ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఆయా గ్రామాల్లో ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం