ATMA Committee | తొగుట, సెప్టెంబర్ 1 : పంచాయతీరాజ్ ఏఈగా, డీఈగా రామకృష్ణారెడ్డి మండలానికి చేసిన సేవలు మరువలేనివని దుబ్బాక ఆత్మకమిటీ చైర్మన్ గాందారి నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తొగుట మండల పరిషత్ కార్యాలయంలో పదవి విరమణ పొందిన రామకృష్ణారెడ్డిని శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా గాందారి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా, డీఈగా రామకృష్ణారెడ్డి అనేక సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఇర్ఫాన్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, మాజీ సర్పంచ్ పగలా కొండల్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షడు ఊళ్లేంగాల సాయి ముదిరాజ్, నాయకులు నిరంజన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కృష్ణ, ఉపలయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.
BRS | కేసీఆర్పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
Lakshmi Devipalli | బావోజి తండాలో తాగు నీటి సమస్యను పరిష్కరించండి
Karepalli | ఆదర్శంగా నిలుస్తున్న కారేపల్లి క్రాస్ రోడ్ యువత.. ఆపద సమయంలో అండగా నిలుస్తున్న యువకులు