house collapse | తొగుట, జూలై 26 : గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. ఈ సంఘటన తొగుట మండలం ఘనపూర్లో శనివారం చోటుచేసుకుంది. ఎడతెరిపి కురుస్తున్న వర్షాల కారణంగా ఘనపూర్ గ్రామానికి చెందిన పెద్దపులి రాజవ్వ ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తొగుట తహసీల్దార్ శ్రీకాంత్ రాజవ్వ ఇంటిని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వర్షాలకు మరోవైపు చందాపూర్ గ్రామంలో నరిశెట్టి మల్లవ్వ ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి ఆదుకుంటామని తహసిల్దార్ శ్రీకాంత్ బాధితులకు హామీనిచ్చారు.
Gajwel | గజ్వేల్లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీలు
నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
Motkur : మోత్కూరు- రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన