రాయపోల్, మే 17 : రైతులు రోడ్లపై ధాన్యం రాశులు పోయడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్లపైనే కల్లాలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రోడ్లపైనే రైతులు కల్లాలు చేయడం దారి పొడవునా వచ్చిపోయేవారికి ఇబ్బందిగా మారుతుంది. నడిరోడ్డుపై వరి ధాన్యం కుప్పలు కుప్పలు వేసి అక్కడనే నూర్పిల్లు చేయడంతో ఆయా రోడ్లలో వెళ్లాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు.
రాయపోల్ మండలంలోని సయ్యద్ నగర్, మంతూర్ గ్రామాల్లోని రోడ్లపైనే కిలోమీటర్ పొడవునా కల్లాలు చేయడంతో రాకపోకలకు పెద్ద వాహనాదారులు పడుతున్న ఇబ్బందులు అనేకంగా ఉన్నాయి. గతంలో ఈ రోడ్లపై పరిధాన్యం కుప్పలు వేయడంతో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ రైతులు రోడ్లపైనే వరికుప్పలు నిల్వ చేయడంతో వాహనదారులకు నిత్యం తలనొప్పిగా మారింది. ఈ రూట్లో పరిధాన్యం కుప్పలు. చాలావరకు ఉండడంతో ప్రయాణికులు మరో దారిన వెళ్లాల్సి వస్తుంది.
రోడ్లపైనే ధాన్యం తూకం..
ఐకేపీ అధికారులు కూడా రోడ్లపైనే దాన్యం కుప్పలను తూకం వేస్తున్నారు. గత సంవత్సరం మంతూర్ గ్రామంలో ధాన్యం కుప్పలు ఢీకొని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పటికీ మళ్లీ అదే రోడ్డుపై మంతూర్ నుంచి వెంకట్రావుపేట వరకు ఇరువైపులా ధాన్యం కుప్పలు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అంటూ బైకర్లు, ఇతర వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు.
ఇప్పటికైనా పోలీసులు స్పందించి రోడ్లపై ఉన్న వరి, మొక్కజొన్న కల్లాలను తొలగించి ప్రమాదాలు జరగక ముందే తగు చర్యలు తీసుకోవాలని వాహనాదారులు ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు..
రోడ్లపై పరిధాన్యం తొలగించాలి : రాయపోల్ ఎస్సై రఘుపతి
ప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్లపై వరి ధాన్యం వెంటనే తూకం వేసి తీసివేయాలని రాయపోల్ ఎస్సై విక్కుర్తి రఘుపతి సూచించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఎన్నో కుటుంబాలు ప్రమాదాల బారిన పడ్డారన్నారు. వరి ధాన్యం కుప్పలతో వాహనదారులకు ఇబ్బందిగా ఉందని ఆయన పేర్కొన్నారు.
రోడ్లపై వరి ధాన్యం వేయరాదని.. అది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. రైతులు తొందరగా రోడ్లపై ఉన్న కల్లాలను తొలగించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రమాదాలు జరగక ముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని.. ప్రమాదాలు జరిగిన తర్వాత చేసేది ఏమీ ఉండదని. వారి కుటుంబాలు ఆగమవుతాయని ఎస్ఐ గుర్తు చేశారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు