KCR | తొగుట : కాళేశ్వరం కూలేశ్వరం అంటూ దుష్ప్రచారం చేస్తూ కేసీఆర్ఫై అసత్య ప్రచారం చేయడానికి రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పక్షపాతంగా ఉందని హైకోర్టు కొట్టివేయడంఫై తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు కొట్టి వేయడంఫై హర్షం వ్యక్తం చేస్తూ తొగుట మండలంలోని చందాపూర్ వద్ద పారుతున్న కూడవెల్లి వాగులో కాళేశ్వరం జలాలతో కేసీఆర్ చిత్ర పటానికి పూలు వేసి పాలతోపాటు కాళేశ్వరం జలాలతో జలాభిషేకం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పారదర్శకంగా లేదని తీర్పును కొట్టి వేయడంతోపాటు నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావులపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని, లోపభూయిష్టమైన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేయవద్దని అదేశించడం జరిగిందన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని, అసత్యాలపై సత్యం గెలిచిందన్నారు. రాజకీయ కక్ష సాధింపుతో నిజాలను వక్రీకరించాలనుకున్న వారి ప్రయత్నాలకు కోర్టు తీర్పు బుద్ది చెప్పిందన్నారు.
తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడిన కేసీఆర్ నాయకత్వం, ప్రజాహితం కోసం నిరంతరం పనిచేసిన హరీష్ రావు సేవలు మళ్లీ న్యాయస్థానం ముందు న్యాయం పొందాయన్నారు. ఇది కేవలం ఒక తీర్పు కాదని, ప్రజల నమ్మకానికి వచ్చిన ధృవీకరణ అన్నారు..
60 ఏండ్లుగా కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణలో కాళేశ్వరం జలాలు పారించి సస్యశ్యామలం చేసిన కేసీఆర్ఫై నిందలు మానుకోవాలన్నారు. అనవసర ఆరోపణలు చేసినవారు ఇకనైనా నిజాలను అంగీకరించాలని, తెలంగాణ అభివృద్ధి కోసం కెసిఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల మేలు కోసమేనని ఈ తీర్పు స్పష్టం చేసిందన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా అసత్యాలపై పోరాటం కొనసాగుతుందని, సత్యమే చివరికి విజయం సాధిస్తుందన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కుట్రలు మానుకొని ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బారాజ్కు మరమ్మత్తు లు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంఫై రేవంత్ సర్కార్ కుట్రలు హైకోర్టు తీర్పుతో కుప్పకూలాయని సర్పంచ్ బక్క కనకయ్య పేర్కొన్నారు.
ప్రభుత్వంకు చిత్త శుద్ధి ఉంటే వెంటనే దుబ్బాక నియోజకవర్గంలో ఉప కాలువలు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనగామ సుభాష్ గౌడ్, చంద స్వామి, బండారు స్వామి గౌడ్, బోయిని శ్రీనివాస్, భూమయ్య, మల్లేశం, మహేష్, రఫిక్ పాషా, బొడ్డు స్వామి, మనోహర్, సుతారి రాములు, పిట్ల వెంకటేష్, బంధారం సంతోష్, జహంగీర్, రాంబాబు, నాగరాజు, రాకేష్, నవీన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Kailsas Bapu Kote | కుమార్తె కలుగాలన్న ఆశ నెరవేరకపోవడంతో ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?
Telangana High Court | పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే!