Kailsas Bapu Kote | కుమార్తె కలుగాలన్న ఆశ నెరవేరకపోవడంతో ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?
Kailsas Bapu Kote | కైలాస్బాపు కోటే (Kailas Bapu Kote), సుమిత్ర కోటే (Sumitra Kote)..! ఈ ఇద్దరూ మహారాష్ట్ర (Maharastra) లోని షిర్డీ (Shirdi) కి చెందిన దంపతులు. వీళ్లు పుత్రికా సంతానం కోసం ఎంతో ఆశపడ్డారు. కానీ వారికి ఆ భాగ్యం కలుగలేదు. దాంతో వారు ఆడబిడ్డపై ఉన్న మమకారాన్ని మరో విధంగా చాటుకుంటున్నారు.
Kailsas Bapu Kote : కైలాస్బాపు కోటే (Kailas Bapu Kote), సుమిత్ర కోటే (Sumitra Kote)..! ఈ ఇద్దరూ మహారాష్ట్ర (Maharastra) లోని షిర్డీ (Shirdi) కి చెందిన దంపతులు. వీళ్లు పుత్రికా సంతానం కోసం ఎంతో ఆశపడ్డారు. కానీ వారికి ఆ భాగ్యం కలుగలేదు. దాంతో వారు ఆడబిడ్డపై ఉన్న మమకారాన్ని మరో విధంగా చాటుకుంటున్నారు. ఏళ్లుగా వేలమంది యువతులకు తల్లిదండ్రులుగా మారి కన్యాదానం చేస్తున్నారు. ఒకటికాదు, రెండుకాదు గత 25 ఏళ్లలో ఏకంగా 2,500 మంది అమ్మాయిలకు కన్యాదానం చేశారు.
వీళ్లు పెళ్లిళ్లను ఏదో తూతూమంత్రంగా జరుపరు. వివాహంలోని ప్రతి ఘట్టాన్ని సంప్రదాయం ప్రకారం అంగరంగవైభవంగా జరిపిస్తారు. ఈ విధంగా ఈ దంపతులు సామాన్య కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గిస్తూ అండగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో ఈ జంటలకు ఆడపిల్ల పుడితే వారి పేరిట డిపాజిట్ చేయడానికి వీలుగా బ్యాంకులో రూ.10 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తారు. షిర్డీలోని సాయి సిద్ధి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరు పెళ్లిళ్లు జరిపిస్తారు.
తాజాగా సోమవారం జరిగిన వేడుకలో 51 మంది యువతులకు పెళ్లిళ్లు చేశారు. ఈ వేడుకకు సుమారు 50 వేలమంది అతిథులుగా హాజరయ్యారు. కైలాస్ బాపు దంపతులు వధువులందరికీ ఒక గ్రాము మంగళసూత్రం, చీర, వెండి కాలి మెట్టెలు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువులను బహూకరించారు. అదేవిధంగా ఆడశిశువుల హత్యలకు పాల్పడబోమని, లింగ వివక్ష పాటించబోమని వారు కొత్త జంటలతో ప్రతిజ్ఞ చేయించుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

