ట్రినిడాడ్: వెస్టిండీస్(West Indies) బౌలర్ వేసిన ఓ బౌన్సర్ హెల్మెట్‌కు తగలడంతో.. బ్యాటర్ కిందపడిపోయాడు. దీంతో ఏకంగా ఆ మ్యాచ్‌నే రద్దు చేశారు. ఈ ఘటన వెస్టిండీస్ దేశవాళీ చాంపియన్‌షిప్ క్రికెట్లో జరిగింది. సర్ వివయన్ రిచర్డ్స్ మైదానంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో బౌలర్ జేడన్ సీల్స్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అయి లీవార్డ్ ఐలాండ్స్ బ్యాటర్ జెరిమియా లూయిస్ హెల్మెట్‌కు తగిలింది. బంతి గట్టిగా తగలడంతో బ్యాటర్ కిందపడిపోయాడు. తలకు ఉన్న హెల్మెట్‌ను అతను తీసేశాడు. ఆ తర్వాత కాసేపటికి లేచిన బ్యాటర్ లూయిస్ కోపంలో హెల్మెట్‌ను తన్నాడు. పిచ్ నుంచి వెళ్లిపోయాడు.
అయితే పిచ్ ప్రమాదకరంగా ఉందని అధికారులు మ్యాచ్‌ను అకస్మాత్తుగా నిలిపేశారు. అప్పటికే ట్రినిడాడ్ బౌలర్ జేడన్ సీల్స్ తన ఖాతాలో ఏడు వికెట్లు వేసుకున్నాడు. నిప్పులు చెరుగుతున్న సీల్స్ బౌలింగ్ ధాటికి బ్యాటర్ లూయిస్ నిలవలేకపోయాడు. ఆ సమయంలో లీవార్డ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 140 రన్స్ చేసింది. బ్యాటర్ లూయిస్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాంకషన్ చెకింగ్ చేశారు. అతను నిలకడగా ఉన్నట్లు తేల్చారు.
పిచ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు వెస్టిండీస్ బోర్డు ప్రకటన చేసింది. వెస్టిండీస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.
Jayden Seales has claimed the first seven wickets to fall in an innings for Trinidad & Tobago against Leeward Islands, but looks set to be denied the chance to take 10 with the game halted due to a dangerous pitch. The last ball before the suspension is not for the faint-hearted pic.twitter.com/o4G5ULiSAh
— Ben Gardner (@Ben_Wisden) April 21, 2026