MLA Kotha Prabhakar Reddy | రాయపోల్, ఏప్రిల్ 09 : రాయపోల్, ఏప్రిల్ 09 : దుబ్బాక నియోజకవర్గ రైతులకు సముద్రంగా ఉన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని సకాలంలో విడుదల చేయకపోవడంతో రైతు యాసంగిలో వేసిన వరి పంట పశువులకు మేతగా మారిందని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఇవాళ మల్లన్న సాగర్ పిల్ల కాల్వలను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. దౌల్తాబాద్ మండలంలోని ఇందూప్రియాల్, మాచిన్ పల్లి, చేగుంట మండలం పోసానిపల్లి, కసంపల్లి, చందాయిపేట, మక్క రాజుపేట తదితర గ్రామాలకు మెయిన్ కెనాల్ ద్వారా మల్లన్న సాగర్ ద్వారా రైతులకు గొలుసు కట్టు చెరువు ద్వారా సాగునీరు అందిస్తే.. చెరువులు నిండి ప్రతి రైతుకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేసి రైతుల పంట పొలాలను ఎండు దశకు తెచ్చిందని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో మల్లన్న సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టులను నిర్మించి శంకరంపేట, దుబ్బాక, ఉప్పర్ పల్లి, మెదక్, మల్కాపూర్ తదితర మెయిన్ కాలువలు పూర్తయినప్పటికీ వాటి ద్వారా పిల్ల కాలువలు పూర్తి చేసి చెరువుల్లోకి గొలుసు కట్టడం ద్వారా సాగునీరు అందిస్తే రైతులు ఎంతో సంతోషపడేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సాగు చేసిన వరి పంట పశువులకు మేతగా మారడంతో రైతులు పెట్టుబడులు కూడా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని.. వారు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పట్ల ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్ల కాలువలు పూర్తి చేయడంలో అటు ఇరిగేషన్ అధికారులు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుంది..
నీళ్లు, నిధులు, నియామకాలపై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుందని మ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని. ఇప్పటికే కూడవెల్లి వాగు ద్వారా పంటలకు నీరు అందించడం జరుగుతుందని.. మెయిన్ కెనాల్ ద్వారా పిల్ల కాలువలను పూర్తి చేసి చెరువులు నింపి దశలవారీగా దుబ్బాక నియోజకవర్గ పంట పొలాలకు సాగునీరు అందించి మరో కోనసీమగా మారుస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇరిగేషన్ అధికారులు పట్టణాల్లో ఉండకుండా కాలువల ఫీల్డ్ విజిట్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం సమన్వయకర్త శ్రీనివాస్ గౌడ్, దౌల్తాబాద్, చేగుంట మండలాల రైతులు, అధికారులు పాల్గొన్నారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ