హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా (కే)గ్రామస్తులు ఏది సంచలనమే. పచ్చదనం పరిశుభ్రత, పన్నుల చెల్లింపు ఇలా అనేక విషయాల్లో ముందుంటూ ఆదర్శంగా నిలుస్తుంటారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా వారు చేస్తున్న ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఏప్రిల్ 27 న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తప్పకుండ రావాలని ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెడుతూ, బట్టలు పంచుతూ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రికను మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 27 న 25 ఏళ్ల గులాబీ పండుగకు ప్రతి ఒక్కరు వచ్చి సభను విజయవంతం చెయ్యాలన్నారు. తెలంగాణ ప్రజల కోసం పాటుపడేది బీఆర్ఎస్ పార్టీ అని, కేసీఆర్ వస్తేనే మళ్లీ తెలంగాణ బాగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
బొట్టు పెడుతున్న మీనాక్షి
ఆహ్వాన పత్రికలు అందజేస్తూ..