Urea Supply | రాయపోల్, ఆగస్టు 16 : ఓ వైపు వర్షాలు పడుతుండగా మరోవైపు పంటలకు అవసరమయ్యే యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. రైతులు తెల్లవారుజాము నుంచే కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్నా సరిపడా బస్తాలు దొరకడం లేదు. కొందరు అన్నదాతలు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాయపోల్, దౌల్తాబాద్ మండలాల రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడ్డారు.
యూరియా వస్తుందన్న సమాచారంతో పలు గ్రామాల రైతులు రాయపోల్ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆగ్రోస్, ఫర్టిలైజర్ షాప్‌ల ఎదుట వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి ఉదయం 6 గంటల నుంచే వర్షంలో గొడుగులు పట్టుకొని బారులు తీరారు. క్యూలైన్లో నిల్చొని ఇబ్బందులు పడ్డారు. ఆగ్రోస్ కేంద్రానికి 560 బస్తాల యూరియా, యాదాద్రి ఫర్టిలైజర్ షాప్‌కు 300 బస్తాల యూరియా రావడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి నరేష్ తెలిపారు.
అయినప్పటికీ ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పన పంపిణీ చేయడంతో దాదాపు చాలా మంది యూరియా దొరకక వెనుదిరిగి వెళ్లారు. రైతులు యూరియా కోసం ఉదయం నుంచే గంటల తరబడి క్యూలో నిల్చున్నా.. యూరియా దొరకపోవడంతో చేసేదేమీ లేక తీవ్ర ఆసంతృప్తిలో వర్షంలోనే వారి గ్రామాలకు వెళ్లిపోయారు.
యూరియా సరఫరా సరిగా లేకపోవడంతో పంటలపై ప్రభావం పడుతున్నదని, తక్షణం అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూలో నిల్చుంటున్నామని, ప్రభుత్వం తక్షణం రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Election | ఓదెల పెరక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
Urea shortage | సైదాపూర్‌లో యూరియా కొరత.. వర్షాన్ని లేక్క చేయకుండా రైతుల క్యూ..!
Krishnashtami | చిగురుమామిడిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఆకట్టుకున్న చిన్నారుల వేశధారణ