Krishnashtami | చిగురుమామిడి, ఆగస్టు 16: కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బొమ్మన పల్లి, గాగిరెడ్డిపల్లి, ఇందుర్తి, తదితర గ్రామాల్లో చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలతో అలరించారు. మండల కేంద్రంలోని డార్విన్ స్కూల్లో చిన్నారులు వేషధారణలతో పలువురిని అలరించారు.
ప్రతీ ఏటా కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తామని పాఠశాల కరస్పాండెంట్ సమ్మిరెడ్డి తెలిపారు. కాగా పలు గ్రామాల్లో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజామునే దేవాలయాలకు వెళ్లి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.