Election | ఓదెల, ఆగస్టు 15: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పురిగిరి క్షత్రియ పెరక సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘ కార్యాలయంలో కులస్తులు ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కాని గంటి ఎర్ర శంకరయ్య, ఉపాధ్యక్షులుగా తీర్థాల వీరయ్య, చింతం వెంకటస్వామి, అప్పని కుమారస్వామి, బుద్దే రామస్వామి ( రేషన్ డీలర్), ప్రధాన కార్యదర్శిగా చింతం కుమారస్వామి, సహాయ కార్యదర్శిలుగా దోమటి సదయ్య, బుద్దే మహేందర్, గోపతి ఎర్ర మల్లయ్య, ఎంబడి తిరుపతి, కోశాధికారిగా బోడకుంట రామచంద్రం, మిగతా కార్యవర్గ సభ్యులను త్వరలోనే ఎన్నుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఎన్నికైన నూతన పాలకవర్గాన్ని కుల సంఘ నాయకులు పలువురు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి బోడకుంట చిన్నస్వామి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బోడకుంట నరేష్, అల్లం సతీష్, తీర్థాల వీరన్న, కుమార్, చింత మొగిలి, బోడకుంట నందయ్య, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.